Pawan Kalyan : కురిడి గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం

TRINETHRAM NEWS

కొడుకు ఆరోగ్యానికి కురిడి గ్రామస్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ డుంబ్రిగూడ ఏప్రిల్ 10: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామంలో జనసేన పార్టీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన 2018 పర్యటనలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా, 2025 ఏప్రిల్ 8వ తేదీన ఉప ముఖ్యమంత్రి హోదాలో “అడవితల్లి” బాట యాత్రలో భాగంగా గ్రామాన్ని సందర్శించారు. గ్రామ శివాలయంలో దర్శనం చేసుకొని, రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో సన్నిహితంగా మమేకమయ్యారు. ఈ సందర్శన గ్రామస్తుల హృదయాలను గెలుసుకున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక జనసేన కార్యకర్తలు ఆయన పర్యటనకు ఘన స్వాగతం పలికారు.అయితే ఈ సందర్భంగా ఒక విషాదవార్త కూడా వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుతున్న స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదానికి గురయ్యారని సమాచారం వచ్చింది. ఈ వార్తతో ఆయన కుటుంబం, అభిమానులు తీవ్రంగా బాధపడ్డారు.
ఈ ఘటనపై కురిడి గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, మరియు జనసేన కార్యకర్తలు ప్రగాఢ చింత వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కురిడి గ్రామంలో దర్శించిన మల్లికార్జున స్వామి ఆలయంలో, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలనే ఆశయంతో 118 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు కురిడి ఆలయ కమిటీ మరియు గ్రామస్తులు నిర్వహించారు. శివుని ఆశీస్సులతో మార్క్ శంకర్ తిరిగి ఆరోగ్యవంతంగా నిలవాలని, చల్లగా నూరేళ్ల ఆరోగ్యంతో జీవించాలని కురిడి గ్రామ ప్రజలు ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలొ జనసేన కార్యకర్తలు,మరియు గ్రామస్థులు, పి.శంకర్రావు,ఎస్.శివ,ఎం. మళ్లీ. కె.సత్యనారాయణ, కె.ఏరుకునాయుడు,కే. సాయి,డి.సత్యనారాయణ,డి.సీతారాం,ఎన్.జగదీష్ డి.సన్యాసిరావు. ఎం నందీశ్వరరావు, తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pawan Kalyan's visit to

You cannot copy content of this page

Scroll to Top