అల్లూరి జిల్లా అరకు లోయ త్రినేత్రం న్యూస్ మార్చి 11: ఈ నెల 12 తేదిన రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ నిర్వహించే యువత పోరు” పోస్టర్ ను అరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మరియు అనంతగిరి మండలం వైఎస్ఆర్సీపీ సమావేశంలో భాగంగా హరిత రిసోర్ట్స్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా 12 తేదిన’ వైయస్ఆర్‌సీపీ నిర్వహించే యువత పోరు’తో ప్రభుత్వాన్ని నిలదీద్దాం విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కూటమి సర్కార్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసే వరకు పోరు సాగించాలని అలాగే నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచారు. నిరుద్యోగభృతి పేరుతో మరో వంచన కూటమి సర్కర్ వైఫల్యాలను ఎత్తిచేపేలా వైయస్ఆర్‌సీపీ అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంగా నిరసన కార్యక్రమాలు చెయ్యాలని అన్ని వర్గాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం మరియు ఈనెల 12వ తేదీన వైయస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం.
అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలి. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలి. ప్రజల్లో వైయస్‌ఆర్‌సీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలి. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయాలి. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పించాలి. మండలస్థాయి కమిటీల ఏర్పాటుకు కూడా నియోజకవర్గ ఇన్‌చార్జీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పాంగి చిన్నారావు , అరకులోయ, అనంతగిరి మండలాల వైయస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షులు స్వభి రామ్ మూర్తి , శ్రీ కొర్ర సూర్యనారాయణ, అరకులోయ జెడ్పీటీసీ శెట్టి రోషిణీ, అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి అరకులోయ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు పాడి రమేష్ , అనంతగిరి సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఫాగి అప్పారావు, వైస్ ఎంపీపీలు శ్రీ కిల్లో రామన్న, దూరు జయవర్థిని, ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిలు నరసింహ మూర్తి, గంగరాజు, మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా అధికార ప్రతినిధి కొర్ర గాసీ, వైయస్సార్‌సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు గ్రీవెన్స్ సెల్ పెట్టేలీ శుక్ర, అరకు అసెంబ్లీ నియోజకవర్గం విభాగాల అధ్యక్షులు ఎస్టీ సెల్ అధ్యక్షులు రేగబోయిన స్వామి, అంగన్వాడీ సెల్ అధ్యక్షులు పాడి కవితా, మరియు వైయస్సార్‌సీపీ సీనియర్ ముఖ్య నాయకులు దూరు గంగన్న దొర , కమ్మిడి అశోక్ , శెట్టి అప్పాలు, సాంబ, సంపత్, డానియల్, నవీన్, కిరణ్, గంగూలీ, కృష్ణ మూర్తి, ప్రకాస్, విజయ్, మరియు అరకులోయ అనంతగిరి రెండు మండలాల పరిధిలో గల వివిధ పంచాయితీ, సెగ్మెంట్ ఎంపీటీసీలు, సర్పంచులు వైయస్సార్‌సీపీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


