Adivasi Party : కొత్త రాజకీయాలు చేద్దాం రండి

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : సరికొత్త రాజకీయాలు చేద్దాం రండని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు పిలుపునిచ్చారు.గతం నుండి నేటి వరకు రకరకాల రాజకీయ పార్టీలలో రకరకాల రాజకీయాలు చేసామని,అలాంటి రాజకీయాలను స్వస్తి చెప్పి సరికొత్తగా మన కోసం మనం రాజకీయం చేద్దామని,ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసి మోసాపోకుమా అని పెద్దలు ఊరికే అనలేదని,ఇప్పటివరకు రకరకాల రాజకీయ పార్టీలను,రకరకాల నాయకులను చూసాం.కుటుంబ పార్టీలను చూసి,కుల పార్టీలను చూసాం,మత పార్టీలను చూసాం కానీ ఏ పార్టీ కూడా ఆదివాసీ జాతి కోసం పనిచేయడం లేదన్నది జగమెరిగిన సత్యం.ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి మరొక ఎత్తని,ఆదివాసీలం సొంతంగా రాజకీయాలు చేయాల్సిందే.
ఆదివాసీలం ఆత్మ గౌరవంతో రాజకీయాలు చేద్దామని,అసలు ఆదివాసీలుగా రాజకీయాలు ఎందుకు చేయాలని ఆలోచించినప్పుడు ఆదివాసీ జాతిని కాపాడుకునేందుకు ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు,చట్టాలు,జిఓలు సక్రమంగా అమలు చేయించుకోవడానికి ఆదివాసీలు ఖచ్చితంగా రాజకీయాలు చేయాల్సిందే లేదంటే ఆదివాసీ హక్కులు,చట్టాలు,జిఓలు తుంగలో తొక్కబడతాయని బుద్ధి జీవులందరికి తెలిసిందే.ప్రజాస్వామ్యంలో రాజకీయాలే అత్యున్నతమైనవి.రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.ఏమైనా చేయోచ్చు,జరగొచ్చు.ఆదివాసేతర పార్టీలు ఆదివాసీ హక్కులు, చట్టాలు,జిఓలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని,కావాలనే హక్కులు, చట్టాలు, జిఓలను అమలు చేయడం లేదు.

ఆయా పార్టీలలో ఉన్న ఆదివాసీ నాయకులు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఆదివాసీలకు ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ లేక పోవడంతో ఇన్నాళ్లు ఏదో ఒక పార్టీలో దిక్కు లేక ఉండాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు, ఆదివాసీలకంటూ ఒక రాజకీయ పార్టీ ఉందని,పూర్తిగా ఆదివాసిలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు,చట్టాలతో కూడిన ఎజెండాతోనే ఆదివాసీ పార్టీ నడుస్తున్నదని,ఆదివాసేతర పార్టీలలో ఉన్న పెద్ద ఆదివాసీ నాయకులమని చెప్పుకొనే వారు కూడా చిన్నబోతున్నారని, ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసినప్పుడు పెద్ద నాయకులు పడిన అవమానం వర్ణనాతీతం, పోనీ ఆ పదవులతో తమ జాతికి ఏమైనా మంచి చేయగలరా అనుకుంటే అది ఏమి లేదు,ఇంకా నష్టం కలిగిస్తున్నారు, గత ప్రభుత్వ హయాంలో ఎస్టీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే వాల్మీకి బోయలను గిరిజన జాబితాలోకి కలపాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

అసెంబ్లీలో ఉన్న గిరిజన ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మాట్లాడలేదు.ఆ పార్టీలో ఉన్న ఆదివాసీ నాయకులకు,కార్యకర్తలకు బాధగా ఉండవచ్చు కానీ చెప్పలేని పరిస్థితి.ఆదివాసేతర పార్టీలో స్వేచ్ఛ లేదు అనడానికి మరో ఉదాహరణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి గెలిచిన పాడేరు,అరకు ఇద్దరు ఆదివాసీ ఎమ్మెల్యేలు ఆదివాసీ జాతి సమస్యలపై అసెంబ్లీలో తమ గళం విప్పడానికి సిద్ధం అయ్యి, అసెంబ్లీ వరకు వెళ్ళిన వారి నాయకుడు జగన్ వెళ్ళవద్దంటే వెళ్ళలేక, ఉండలేక ప్రజల దగ్గర అవమానం పడుతున్న విషయం అందరికీ తెలిసిందే.ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనేతరులు సంఘాలు పెట్టుకొని పోరాడాలని,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గిరిజన సంక్షేమం)వ్యవస్థను తీయించేసానని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రగల్భాలు పలికి ఆదివాసీజాతికే కళంకితుడుగా మారారు.

అసెంబ్లీలో జిఓ నెం 3 మీద మాట్లాడి శభాష్ అనిపించుకొన్న రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష ఏజెన్సీలో గిరిజనేతరులకు ఇళ్లు ఇవ్వమని ఛీ అనిపించుకొన్నారు.ఎవరో వ్రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఆదివాసీ ప్రజా ప్రతినిధులు చదువుతున్నారని,21వ శతాబ్దంలో కూడా సొంతంగా ఆదివాసీలు మాట్లాడలేరా,ఇలాగైతే ఆదివాసీల పరిస్థితి ఎప్పుడు మారుతుందని,తరాలు మారుతున్న ఆదివాసీల తలరాతలు మారడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ ఛైర్మన్ మొడియం శ్రీనివాస్,ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's do new politics

You cannot copy content of this page

Scroll to Top