జూలై 16, 2026
TRINETHRAM NEWS
MLA Raj Thakur says

MLA Raj Thakur : త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి …గోదావరిఖని రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణుల కోసం ఆదివారం నిర్వహించిన దావత్-ఇ-ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రామగుండం పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి ఇఫ్తార్ విందులో భాగస్వామ్యమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం త్యాగం, కరుణ, సహనానికి ప్రతీక అని తెలిపారు. సమాజంలో సౌహార్ద్రత, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ పవిత్ర మాసం ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

You cannot copy content of this page