Distribution of Sarees : ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదినోత్సవం సందర్భంగా చీరలు, క్రికెట్ కిట్‌ల పంపిణీ

TRINETHRAM NEWS
Distribution of sarees and cricket kits

Distribution of Sarees : త్రినేత్రం న్యూస్, మురమండ గ్రామం: రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బచయ్య చౌదరి, జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మురమండ గ్రామంలో మహిళా మణులకు చిరు కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే గ్రామ యువతకు ప్రోత్సాహం అందించేందుకు క్రికెట్ జట్టుకు కిట్‌లను కూడా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మురమండ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు దేవళ్ళ రామ్మోహన్ (రాంబాబు) పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధికారి ప్రతినిధి ప్రత్తిపాటి రామారావు చౌదరి, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్రా వీరభద్రరావు, గ్రామ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పల్లి సురేష్, బూత్ కన్వీనర్ పల్లి వెంకటరావు, కో బూత్ కన్వీనర్ కోటిపల్లి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామ ప్రజలు కూడా ఎమ్మెల్యే,కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top