MLA Nenavat Balu Naik : దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.

TRINETHRAM NEWS

చింత పల్లి మార్చ్ 13, త్రినేత్రం న్యూస్. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చింతపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ ప్రార్థనల్లో పాల్గొని, రాష్ట్ర ప్రజలు శాంతి-సమృద్ధులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ రంజాన్ మాసం అనేది త్యాగం, సహనం, దాతృత్వం మరియు సోదరభావాన్ని పెంపొందించే పవిత్రమైన నెల అని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్ష సమాజానికి ఆత్మ నియంత్రణ, పరస్పర సహకారం వంటి విలువలను నేర్పుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, మైనారిటీ సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ భవానీ పవన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగభూషణం, మాజీ సర్పంచ్ ముచర్ల గిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Nenavat Balu Naik participated in the Davat-e-Iftar

You cannot copy content of this page

Scroll to Top