రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరికీ అండగా నిలబడే నాయకుడిగా, ప్రతి మంచి, చెడు సమయంలో పౌరులతో పాటు ఉండే మానవతావాది రాజ్ ఠాకూర్ మరోసారి తన మానవీయతను చాటుకున్నారు. ఇటీవల 5వ డివిజన్ పరిధిలో చోటు చేసుకున్న పలు అనుభవ దుఃఖదాయక సంఘటనల కారణంగా తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆయన వ్యక్తిగతంగా పరామర్శించారు
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే వారి బాధను దగ్గరుండి పంచుకుంటూ”మీ బాధ నాకు వ్యక్తిగత బాధలా అనిపిస్తోంది. ఒక నాయకుడిగా కాదు, ఒక తమ్ముడిగా, కొడుకులా మీకు తోడుంటాను,” అని చెప్పారు. వారి మాటలలో కనిపించిన మానవతా స్పూర్తి అక్కడి ప్రజల మనసును తాకింది. ప్రతిఒక్క ఇంటికీ వెళ్లి, ప్రతి కుటుంబ సభ్యునితో మాట్లాడి, వారిని ఓదార్చే ప్రయత్నం చేసిన ఆయన నిస్వార్థ సేవకు ప్రతి ఒక్కరు ప్రశంసలతో అభినందనలు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


