జూన్ 26, 2026
TRINETHRAM NEWS
MLA Nenavath Balu Naik

ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ .

MLA Nenavath Balu Naik : దేవరకొండ డివిజన్ జూన్ 16: త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 25 నుండి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) ఓటరు నమోదు ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీ ఎల్ ఏ లు) కీలక బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పేర్కొన్నారు.

మంగళవారం దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు (బీ ఎల్ ఏ లు) ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఓటర్ల హక్కులను పరిరక్షించడంలో బీ ఎల్ ఏ ల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.

దేశవ్యాప్తంగా అమలు చేయనున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ బీ ఎల్ ఏ లు అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి అర్హుడైన వ్యక్తి ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయడం ద్వారా దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, యువత మరియు మహిళల ఓటు హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఓటర్ల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల సహకారంతో ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ మండలాల బీ ఎల్ ఏ లు, పార్టీ నాయకులు, యువజన నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page