జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Kethavath Babu Ram Naik

ఆర్ టి ఐ ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు;- కేతావత్ బాబు రామ్ నాయక్.
Kethavath Babu Ram Naik : త్రినేత్రం న్యూస్ : తెలంగాణలో ప్రవేట్ పాఠశాలలు అధిక ఫీజులు అక్రమ పుస్తకాల విక్రయాలు ఆర్టీఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని బాబురామ్ నాయక్ మండిపడ్డారు. అనుమతి లేని స్కూల్, హాస్టల్ల పై తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యానిధులు వినియోగంపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో 70% ప్రైవేట్ స్కూల్లో అగ్నిమాపక మున్సిపల్ భావన విద్యాశాఖ ఆమోదాల వంటి ప్రాథమిక అనుమతులు లేకుండా నడుస్తున్నాయని అధికార యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందని ఆవరణలో వెలుపల నిర్వహిస్తున్న హాస్టల్లో కూడా సాంఘిక సంక్షేమ శాఖ విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా కొనసాగుతున్నాయని వాహనాల రవాణాలో పింక్ బుక్ నియమాలు సిబ్బంది నియామకంలో అర్హతలు కూడా పాటించడం లేదని ఆయన ఆరోపించారు విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తి విఫలం సరైన చర్యలు తీసుకోకపోతే ఆర్టీ ఐఎస్ఎస్ సొసైటీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు సామాజిక సంఘాలను ఏకం చేసి ధర్నాలు నిరసనలు, ఉద్యమాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
పేద విద్యార్థుల ఫీజుల రియంబర్స్మెంట్ వివరాలపై ప్రభుత్వం అపారదర్శకంగా వ్యవహరిస్తుందని దీనిపై వెంటనే విచార కమిటీ ఏర్పాటు చేసి శ్వేత పత్రం విడుదల చేయాలని , ప్రతి స్కూల్ ముందు ప్రభుత్వ ఆమోదిత ఫీజు బోర్డు తప్పనిసరిగా చేయాలని ప్రవేట్ పుస్తకాల క్రమశిక్షణ అరికట్టాలని ప్రభుత్వం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని అలాగే కేంద్ర విద్యానిధుల పారదర్శకతపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page