
Classmates Provide Financial Aid : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు, (త్రినేత్రం న్యూస్ )జూన్ 16: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి అతని మాజీ సహపాఠులు అండగా నిలిచారు. పెనుమూరు మండలం గాంధీపురానికి చెందిన అనిల్‌కుమార్ (37) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో అతనితో 2004-05 ఏడాదిలో పదవ తరగతి చదివిన స్నేహితులు కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.
అందరూ కలిసి చందాలు సేకరించి రూ.55 వేల నిధిని సమకూర్చారు. ఈ మొత్తాన్ని సోమవారం రాత్రి అనిల్ కుటుంబ సభ్యులకు అందజేశారు. అనిల్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి భవిష్యత్తుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ కుటుంబానికి అండగా ఉంటామని స్నేహితులు తెలిపారు. స్నేహితుడి కుటుంబానికి సహపాఠులు అందించిన ఈ సాయం పలువురి ప్రశంసలు అందుకుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe