MLA Kavya Krishna Reddy : కొండ బిట్రగుంట బ్రాహ్మణ సత్రంలో ఉపనయన మహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: మార్చ్ 2 నెల్లూరు జిల్లా: కొండ బిట్రగుంట… నెల్లూరు జిల్లా, కొండ బిట్రగుంటలోని బ్రాహ్మణ సత్రంలో నిర్వహించిన ఉపనయన మహోత్సవ కార్యక్రమం ఆదివారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, హాజరై వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు. ఉపనయనం అనే సాంప్రదాయ వేద సంస్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

వేద మంత్రోచ్చారణల నడుమ బాలురకు యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు. సంప్రదాయాలను కాపాడుతూ యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు, వేద పండితులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Kavya Krishna Reddy participated in the Upanayana Mahotsavam

You cannot copy content of this page

Scroll to Top