CPM : కామ్రేడ్ కృష్ణ మృతికి సంతాపం రెడ్ ఫ్లాగ్ కప్పి ఘన నివాళి అర్పించిన సి.పి.ఎం. పార్టీ నాయకత్వం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: మార్చ్ 2 తిరుపతి జిల్లా: రేణిగుంట మండలం: తిమ్మయ్య గుంట… రేణిగుంట మండలం: తిమ్మయ్య గుంట గ్రామానికి చెందిన రేణిగుంట సి.పి.ఎం .పార్టీ శాఖ సభ్యుడు కామ్రేడ్ కృష్ణ మృతి చెందాడని వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు సిపిఎం నాయకత్వం కలిసి తిమ్మయగుంట నివాసంలో వద్ద ఉంచిన కృష్ణ, పార్ధు దేహం పైన సి.పి.ఎం. రెడ్ ఫ్లాగ్ కప్పి జోహార్లు అర్పిస్తూ.. ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం సంతాపం ప్రకటించి మౌనం పాటించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొండ్రెడ్డి హరినాథ్ మాట్లాడుతూ.. 2025 మార్చి 3తేది రాత్రి సమయంలో తన స్కూటర్లో తిరుపతి నుండి తిమ్మయ్య గుంట నివాసానికి వస్తున్న సందర్భంగా తిరుపతి డీ మార్ట్ వద్ద రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ జరిగి తలకు బలమైన గాయం కావడంతో గత కొంతకాలంగా ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ..

తిరుపతి ‘మెడిగో ఆసుపత్రి’ లో తలకు ఆపరేషన్ జరిగి ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారని తిరుపతి జిల్లా సిపిఎం పార్టీ తరఫున వారి కుటుంబానికి, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతిని సంతాపం ద్వారా తెలియపరుస్తున్నామని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య, సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఆయన డివైఎఫ్ఐ యువజన సంఘం లో 1992లో చేరి, 1993లో కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడై సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకొని డివైఎఫ్ఐ యువజన సంఘం , భవన నిర్మాణ సంఘం జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేశారు.

సిపిఎం పార్టీ రేణిగుంట టౌన్ శాఖ సభ్యుడిగా పనిచేశారు. శెట్టిపల్లి ఇంటి స్థలాల భూ పోరాట కమిటీ కార్యదర్శిగా నాయకత్వం బాధ్యతలు తీసుకొని అహర్నిశలు కృషిచేసి ప్రభుత్వం ద్వారా పేదలకు పట్టాలు సాధించిపెట్టారు అని అన్నారు. శెట్టిపల్లి ఇంటి స్థలాల భూ పోరాట కమిటీ అధ్యక్షుడు రాధాకృష్ణ, డివైఎఫ్ఐ నాయకుడు చినబాబు, నరేంద్ర మాట్లాడుతూ..
అతను నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన తన తృది శ్వాస వరకు సిపిఎం పార్టీ ఉద్యమాలు_ పోరాటాల్లో ముందుండి పనిచేశారని తెలిపారు. పార్టీ నేర్పిన క్రమశిక్షణ, నిబద్ధత, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రభుత్వం తోను, అధికారులతోను రాజీపడకుండా ప్రజల పక్షాన అండగా నిలబడి పోరాటాలు నడిపిన కామ్రేడ్ కృష్ణ ను కోల్పోవడం తిరుపతి జిల్లా సిపిఎం పార్టీకి తీరనిలోటని తెలిపారు.
కామ్రేడ్ కృష్ణ పార్థివ్ దేహాన్ని సందర్శించి (రెడ్ ప్లాగ్) తో నివాళులు సంతాపం, తెలియజేసిన వారిలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, అంగేరి పుల్లయ్య, సుబ్రహ్మణ్యం, చల్లా వెంకటయ్య, జయచంద్ర, వేణు, సాయి లక్ష్మి, బాలసుబ్రమణ్యం, రాధా, మల్లికార్జున్, బుజ్జి, చినబాబు, మోహన్ నాయుడు, రేణిగుంట సిపిఎం నాయకత్వం హరినాథ్, సెల్వరాజ్, వెంకటరమణ, ఈశ్వరమ్మ, సత్య శ్రీ, శివానందం, దిలీప్ భాషా, రాజశేఖర్, కరీముల్లా, భాస్కరాచారి, కుప్పస్వామి, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి, రాధాకృష్ణ, జయలక్ష్మి, మునేంద్ర తదితరులు నివాళులర్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CPM party leadership paid tribute by covering the red flag

You cannot copy content of this page

Scroll to Top