TELANGANA

MLA Kavvampally : మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్య కు నివాళులర్పించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

TRINETHRAM NEWS

దళితుల అభివృద్ధి ఔన్నత్యం కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి దామోదరం సంజీవయ్య – మానకొండూరు ఎమ్మెల్యే, టిపిసిసి ఎస్ సి సెల్ చైర్మన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ

Trinethram News : ఫిబ్రవరి 14, డిసిసి కార్యాలయం, కరీంనగర్… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే, పిసిసి ఎస్ సి సెల్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై జిల్లా కాంగ్రెస్ ఎస్ సి సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఎస్ టి సెల్ అధ్యక్షులు బానోతు శ్రవణ్ నాయక్, జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్ తో పాటు పలువురు నాయకులతో కలిసి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి గా పని చేసినారు, కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రిగా పనిచేయడంతో పాటు రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి అటు పార్టీకి, ఇటు ప్రజలకు సేవలు అందించినారు, ఒక పేద కుటుంబం నుండి వచ్చి దళితుల అభివృద్ధి, ఔన్నత్యం కోసం నిరంతరం శ్రమపడిన వ్యక్తి, ఎలాంటి ఆస్తులు కూడబెట్ట కుండా పేదరికంలో జీవించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు, వారిని ఆదర్శంగా తీసుకొని నేడు కాంగ్రెస్ పార్టీ లో వి హనుమంతరావు లాంటి వారు నేటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయతతో నిబద్ధతకు కట్టుబడి పనిచేస్తున్నారని, తుది శ్వాస వరకు తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన సంజీవయ్య జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము అని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Kavvampally pays tribute to former Chief Minister Sanjeevaiah

You cannot copy content of this page