తేదీ : 31/05/2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, మండలం, చింతపల్లి గ్రామంలో శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పల్లె నిద్రకు వచ్చి నూతనంగా నిర్మించినటువంటి అంగన్వాడి భవనాన్ని ప్రారంభించి మామిడి మొక్కను నాటడం జరిగింది. అనంతరం పల్లెనిద్ర భాగంగా మేడిశెట్టి వారి పాలెం, చింతంపల్లి గ్రామానికి సంబంధించిన ప్రజలు కు ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని సంబంధిత ఆర్జీలపై వ్రా సి ఎమ్మెల్యేకు అందజేయడం జరిగింది. తక్షణమే ప్రభుత్వ సంబంధిత అధికారులకు ఆ సమస్యలకు పరిష్కారం చేయాలని వారిని ఆదేశించారు. వెంటనే వారు స్పందిస్తూ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. చాక్లెట్ కంపెనీని చింతలపూడి నియోజకవర్గానికి పునాది వేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే.
ముఖ్యమంత్రి చంద్రబాబు , ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఆ కంపెనీని త్వరలోనే చింతలపూడి నియోజకవర్గంలో నిర్మించి ప్రారంభిస్తామని ప్రజలకు మరియు సంబంధిత రైతులకు, కూటమి నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది. దీనితో వాళ్లు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. చింతలపూడి లోని తాను ఉంటున్న ఇల్లు అద్దె అని తెలిపారు. ప్రతిరోజు కూడా కార్యకర్తలు, నాయకులు ప్రజలు వచ్చి ఎమ్మెల్యేను కలిసి వాళ్ళు చెప్పిన సమస్యలకు పరిష్కారం చేస్తున్నాను అని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో మీటింగులు, అదేవిధంగా రాష్ట్రస్థాయి అమరావతిలో మీటింగులు ఉన్నప్పుడు వాటికి అటెండ్ అవ్వడం జరుగుతుందని ఉన్నారు.
ఎవరో మూర్ఖుడు సోషల్ మీడియా లో ఆయన గురించి తప్పుడు వార్తలు ప్రకటిస్తున్నారని , అటువంటి వాళ్ళని గుర్తుంచుకొని వాళ్లు ఎవరైతే తెలిస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇలా పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క సమస్యలు ఎక్కువగా తెలుసుకుని వాళ్లకు న్యాయం చేస్తానని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలపడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు అధినేతల కారు, కార్యకర్త మాత్రమే అధినేత అని కొనియాడారు. కార్యకర్త లేనిదే పార్టీ లేదు , పార్టీ లేనిదే మేము లేము అని తనదైన శైలిలో వివరించడం జరిగింది.
రోజుకు ఇరవై నాలుగు గంటలు సమయం ఎనిమిది గంటల మాత్రమే పనిచేయాలి. కానీ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఎక్కువగా పనిచేస్తున్నారని, ప్రజల కోసమే పని చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్నాయని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి నా కంటికి నిద్ర లేకుండా నేను పనిచేస్తున్న, నాయకులు, కార్యకర్తలు, అధికారులు చేస్తున్నారని సంతోషాన్ని ఉంచుకున్నారు. పల్లె నిద్రకు వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా బిస్కెట్ ప్యాకెట్లు, మరియు మంచినీరు, విందు భోజనాలు, సౌకర్యం కల్పించారు. కూటమి నాయకులు వాళ్ల రీతిలో ప్రసంగించి వాళ్ల యొక్క అనుభవాలను వ్యక్తపరిచారు.
ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నది ఎంత నిజమో ఆ నిజాన్ని ఎప్పటికీ మన్ను చేయరని ఆ నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మండల, గ్రామ ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు , ప్రజలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, తదితరులు పాల్గొని పల్లెనిద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


