తేదీ : 31/05/2025. గుంటూరు జిల్లా : అమరావతి ; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పేదలకు అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి ఇంటింటికి అందిస్తామని రూపాయలు పదహారు వందల కోట్లతో సంబంధిత వాహనాలు కొనుగోలు చేసి ఇంటింటికి ఇవ్వడం మానేసి నెలలో, ఒకటి మరియు రెండురోజులు మాత్రమే జంక్షన్ లో వాన నిలిపి ఇవ్వడంతో ఎంతోమంది పేదలకు ఆ సరుకులు అందక ఇబ్బందులు పడ్డారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారి పనులు మానేసుకొని ఎదురుచూస్తూ ఉండేవాళ్ళు.
మిగిలినటువంటి రేషన్ బియ్యం, సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించి వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ మరియు విశాఖపట్నం పోర్టులో పట్టుకోవడం జరిగింది. వీటిని అరికట్టేందుకు ప్రతి పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు ఇకపై ప్రతినెల ఒకటి వ తేదీ నుంచి పదిహేను వ తేదీ వరకు ఉదయం సమయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం సమయం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం సమయం నాలుగు గంటల నుండి రాత్రి సమయంఎనిమిది గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందిస్తారని తెలిపారు. దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ సరుకులు అందేలా , చర్యలు తీసుకుంది.
అంతేకాకుండా దివ్యాంగులకు,అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులకు , ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. దీనికి ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలుతెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


