త్రినేత్రం న్యూస్ : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కేంద్ర ప్రభుత్వం పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల పామ్ ఆయిల్ సాగుచేసే రైతులపై తీవ్ర ప్రభావం పడ్తుందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రాష్ట్రంలో పామ్ ఆయిల్ సాగు పెంచడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక ప్రోత్సహకాలు ఇస్తుందని, దీనితో రాష్ట్రంలో పామ్ ఆయిల్ సాగు చేయడానికి రైతులు ముందుకొస్తున్నారని గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం. పామ్ ఆయిల్ దిగుమతిపై సుంకం తగ్గించడం సరైన నిర్ణయం కాదన్నారు. ఇది దిగుమతి చేసుకునే పరిశ్రమలకు లాభం చేరుకుతుందన్నారు. ఒకపక్కన రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తూ, సబ్సీడీలు ఇస్తుంటే. కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి ఈ నిర్ణయం పామ్ ఆయిల్ తోటల రైతులకు నష్టం జరుగుతుందన్నారు.
కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గతంలో కూడా మల్టీనేషనల్ కంపెనీలకు దిగుమతి సుంకం తగ్గించి కంపెనీలకు లాభాలు చేకూర్చిపెట్టింది. ఈ దిగుమతి, ఎగుమతి పాలసీ.. పామ్ ఆయిల్ తోటల వ్యవసాయంపైన ప్రభావం పడకుండా ఉండాలి అంటే .. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి, రైతులను కూడా బాగసౌమ్యం చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ దిగుమతి పై సుంకాన్ని తగ్గించి తెలంగాణాలో సాగుచేసే పామ్ ఆయిల్ రైతులకు భారీ పెట్టుబడులు పెట్టి తోటలుపెంచి, ఆ లాభాలు రైతుకు అందకముందే ఈ నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ రైతు కమిషన్ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటుందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


