జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, వారి సతీమణి మనాలి ఠాకూర్ 38వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నెలకంటి రాము ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రజలను ప్రత్యక్షంగా కలసి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, చేతి గుర్తుకు ఓటు వేసి 38వ డివిజన్ నుంచి నెలకంటి రాము ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA couple campaigning vigorously

You cannot copy content of this page