MLA MS Raj Thakur : 25 కోట్ల రూపాయలతో రామగుండం హైవే సర్వీస్ రోడ్ అభివృద్ధి పనులు

TRINETHRAM NEWS

రామగుండం శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్

రామగుండం మే-23:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం హైవే లో చేపట్టిన సర్వీస్ రోడ్ విస్తరణ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ పనులకు సుమారు రూ. 25 కోట్లు ఖర్చు అవుతుందని, నగర రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు పరిశీలన సందర్భంగా ఆయన ర్&బి (రోడ్స్ అండ్ బిల్డింగ్స్) శాఖ మరియు సింగరేణి మున్సిపల్ అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అత్యుత్తమ నాణ్యతతో, నిర్దేశిత కాలపట్టికలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు*.

రామగుండం హైవే అనేది స్థానిక ప్రజలకు మాత్రమే కాదు, పారిశ్రామిక అవసరాలకూ కీలక మార్గం. ట్రాఫిక్ భద్రత, వాహనదారుల సౌకర్యం కోసం సర్వీస్ రోడ్ విస్తరణ ఎంతో అవసరం. ప్రభుత్వ అభివృద్ధి పథకాల్లో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు స్థానిక ప్రజలు అభివృద్ధి పనులను హర్షంగా స్వీకరిస్తున్నారని, ప్రజా సహకారంతో రామగుండం మరింత అభివృద్ధి మార్గంలో దూసుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam Highway Service Road

You cannot copy content of this page

Scroll to Top