ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
MLA Balu Naik

మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.

MLA Balu Naik : కొండ మల్లేపల్లి ఆగష్టు 07 , త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని గౌరీకుంట తండా గ్రామంలో నూతనంగా 10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని సంబంధిత అధికారులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం అదే మండలంలోని గుడితండా గ్రామంలో నిర్మించిన మరో 10 లక్షల రూపాయలతో మహిళా సమాఖ్య భవనాన్ని కూడా ఎమ్మెల్యే ప్రారంభించి మహిళా సంఘాల సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక అభివృద్ధికి మహిళా సంఘాలు కీలక శక్తిగా నిలుస్తున్నాయని అన్నారు. మహిళా సమాఖ్యలకు శాశ్వత కార్యాలయం ఉండటం వల్ల సంఘ సమావేశాలు, పొదుపు-రుణాల నిర్వహణ, లెక్కల నిర్వహణ, శిక్షణా కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సులు, స్వయం ఉపాధి కార్యక్రమాల ప్రణాళికలు ఒకే చోట నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ భవనాలు మహిళల ఐక్యతకు, గ్రామాభివృద్ధిలో వారి భాగస్వామ్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో పాటు దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కాసర్ల వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూరి వేమన్ రెడ్డి, కొండమల్లేపల్లి సర్పంచ్ పసునూరి యుగంధర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రామావత్ సరస్వతి-రవి, స్థానిక సర్పంచ్ నేనావత్ కృష్ణ, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్లు వాంకుడావత్ డాకు, రామావత్ చంటి, ప్రజా ప్రతినిధులు, కొండమల్లేపల్లి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భూతరాజు ప్రేమలత, ఏపీఎం యాదయ్య, వివోఏ రమావత్ స్వామి, మహిళా సంఘాలు, బంజారా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page