ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
National Breastfeeding Week

పుట్టిన గంట లోపే శిశువుకుతల్లి పాలు ఇవ్వాలి. మొదటి 6, నెలల వరకు తల్లి పాలుమాత్రమే ఇవ్వాలి. సూపర్వైజర్ ప్రసన్న లక్ష్మి.

National Breastfeeding Week : చింత పల్లి ఆగష్టు 07, త్రినేత్రం న్యూస్. జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చింత పల్లి మండలం తీదేడు గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ సూపర్వైజర్ ప్రసన్న లక్ష్మి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‌…పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం ఎంతో ముఖ్యమని, మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు.తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని తెలిపారు. గర్భిణులు,బాలింతలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, అంగన్‌వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ,వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ రావు లక్ష్మి,గ్రామ మహిళలు,గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page