జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : మండపేట: శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్‌ మురళీ నాయక్‌ జమ్మూ కాశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందారు. ఈ దుర్వార్తపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దేశ రక్షణ కోసం మురళీ నాయక్ చేసిన త్యాగం అపూర్వమని అన్నారు. మురళీ నాయక్ లాంటి వీరుల ధైర్యం, త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఆయన వీరమరణం తెలుగు జాతికే కాదు, యావత్ భారతావనికి తీరని లోటు అన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLC Thota shocked by

You cannot copy content of this page