
Minister Sheikh Abdullah Ali : త్రినేత్రం న్యూస్ : కువైట్ సిటీ,జూన్ 03: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు పౌర మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఇరాన్ జరిపిన దాడుల్లో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్-సలేం అల్-సబా పరామర్శించారు. బుధవారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు కువైట్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.
బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్న రక్షణ మంత్రి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పౌర ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల నేపథ్యంలో బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe