
Police Recording Calls : త్రినేత్రం న్యూస్ : Jun 03, 2026, కేంద్ర ప్రభుత్వం ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లను రికార్డ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే తప్పుడు ప్రచారమని, వాట్సాప్ బ్లూ, రెడ్ టిక్స్ నిబంధనలపై వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
గతంలోనూ ఇలాంటి తప్పుడు సమాచారంపై స్పష్టత ఇచ్చినా, కొందరు ఉద్దేశపూర్వకంగా షేర్ చేస్తున్నారని సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల పౌరులుగా ఇలాంటి నకిలీ వార్తలను నమ్మవద్దని, ఫార్వర్డ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తప్పుడు వార్తలు సృష్టించి, వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe