Lokesh with Adireddy : మంత్రి లోకేష్ తో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు… తిరుమల విద్యార్థులు

TRINETHRAM NEWS

రాజమహేంద్రవరం :త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఆల్ ఇండియా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాజమండ్రి తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, కాలేజీ చైర్మన్ ఎం తిరుమల రావును విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కల్పించడం జరిగింది. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను, కాలేజీ యాజమాన్యం, సిబ్బందిని నారా లోకేష్ ఈ సందర్భంగా అభినందించారు.

రామ్ కిరీటి నీట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అలాగే ఇండియాలో 19వ ర్యాంకు సాధించారు. కే ప్రణీత జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు ఎస్సీ కేటగిరీలో సాధించారు. యశ్వంత్ సాత్విక్ జేఈఈ అడ్వాన్స్ 2025లో ఆల్ ఇండియా ఈ డబ్ల్యూ ఎస్ కోటాలో 8వ ర్యాంకు సాధించారు. వారందరిని మంత్రి లోకేష్ అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Lokesh with MLA

You cannot copy content of this page

Scroll to Top