జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కడియం డిప్యూటీ ఎంపీడీవో గా ఎన్. శ్రీనివాస్ బాధ్యతులు చేపట్టారు. ఈయన అమలాపురం డివిజనల్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసి డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి పొందారు. గత కొంతకాలంగా ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో జేగురుపాడు పంచాయతీ కార్యదర్శి అయినవిల్లి శ్రీనివాసరావు ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ మాట్లాడుతూ కడియం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమానికి తగిన చర్యలు చేపడుతున్నామన్నారు.అలాగే అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శిలతో సమన్వయ పరచుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Srinivas takes charge as

You cannot copy content of this page