ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Minister Lokesh

Minister Lokesh : కడప జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 15 ; కొమ్మేర్లలో దాల్మియా సిమెంట్ ప్లాంటు విస్తరణ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ , ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు స్ఫూర్తి అని కొనియాడారు. అదేవిధంగా తనకు మార్గదర్శకాలని పేర్కొన్నారు.
వాళ్ల స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధి లో ముందుకు వెళ్తున్నాను అని పేర్కొన్నారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం రాష్ట్రానికి దక్కుతున్నాయని అన్నారు. ప్రభుత్వ స్పీడ్ గవర్నెన్స్, సిద్ధమైన పాలసీలు, వేగవంతమైన సేవలు ఇందుకు కారణం అని తెలిపారు. రాష్ట్రంపై సంస్థలకు విశ్వాసం పెరిగిందని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page