అక్టోబర్ 12, 2026
TRINETHRAM NEWS
Smart Ration Cards

Smart Ration Cards : చింత పల్లి సెప్టెంబర్ 19,త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శనివారంనిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…స్మార్ట్ కార్డుల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ రేషన్ సౌకర్యాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.అర్హత కలిగిన ప్రతి కుటుంబం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పాలన అధికారి బుషిపాక యాదయ్య, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్,వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్,దాసరి కళమ్మ ముత్తయ్య,రెడ్డి పద్మ పరమేష్,శివర్ల పర్వతాలు యాదవ్,రేషన్ డీలర్లు బొడ్డు యాదగిరి,ముద్దం వెంకటయ్య,గ్రామ ప్రజలు,గ్రామ పంచాయతీ సిబ్బంది,లబ్ధిదారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page