అక్టోబర్ 12, 2026
TRINETHRAM NEWS
Nutrition Foundation Progress

Nutrition Foundation Progress : కూకట్ పల్లి : హైదర్ నగర్ సెక్టార్ పరిధిలోని రిక్షాపులర్స్ కాలనీ-1 అంగన్‌వాడీ కేంద్రంలో 9వ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ సిడిపిఓ రేణుక మాట్లాడుతూ చిన్నారులకు పోషకాహార ప్రాధాన్యతను వివరించడంతో పాటు, తల్లులకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శిశు సంరక్షణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగింది. స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మాధవి, ప్లాన్ ఇండియా యశోద ఎస్ బి వి ఎం, అంగన్‌వాడీ సిబ్బంది, తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అధికారులు సూచిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page