Minister Kolusu Parthasarathy : ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారధి

TRINETHRAM NEWS
Minister Kolusu Parthasarathy participated in the inauguration

Minister Kolusu Parthasarathy : ఏలూరి జిల్లా : మార్చి 25: (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, అగిరిపల్లి మండలం, ఈదర గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పర్యటించారు. ఈ సందర్భంగా రూపాయలు నూట యాబై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించినటువంటి సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు.

గ్రామ అభివృద్ధికి , ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన వసతులు అందించడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం అదే మండలం సీతారామపురం గ్రామంలో కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలపై స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top