WhatsApp Image 2024 12 07 at 18.22.04
రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చెన్నూరులో మెగా వైద్య శిబిరం..
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం చెన్నూరు గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అధ్యక్షులు మల్లికార్జున్, సెక్రటరీ వి ఎల్లప్ప, ట్రెజరర్ గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, లైన్స్ క్లబ్ వారు పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్యులతో బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు అందజేస్తారని లయన్స్ క్లబ్ వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందం డాక్టర్ క్యాస శ్రీనివాస్ నాగిరెడ్డి, అభినవ్, ప్రశాంత్, గోపికాంత్, శ్రీకాంత్ తో పాటు జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, రామగుండం మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు, జోన్ చైర్మన్ కజంపురం రాజేందర్, సీనియర్ లయన్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, తిలక్ చక్రవర్తి, పోకల ఆంజనేయులు, గుండ వీరేశం తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
