జూలై 7, 2026

WhatsApp Image 2024 12 07 at 18.20.01

TRINETHRAM NEWS

నిరు పేదలకు కృత్రిమ అవయవాల పంపిణీ….

అంగవైకల్యులకు అండగా లయన్స్ క్లబ్…

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం అర్ధాంతరంగా కాళ్లు చేతులు పోగొట్టుకున్న అభాగ్యులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. అధ్యక్షులు పి మల్లికార్జున్, సెక్రటరీ వి ఎల్లప్ప, ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ డిస్టిక్ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలు కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రజలు అర్ధాంతరంగా కాళ్లు, చేతులు పోగొట్టుకుని అంగవైకల్యాలుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, కృత్రిమ అవయవాలు ధరించాలంటే జైపూర్ హైదరాబాదు లాంటి ప్రదేశాలకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్నదని అందుకు రామగుండం లయన్స్ క్లబ్ వారు శాశ్వతంగా పేద ప్రజలకు అండగా ఉండేందుకు గడ్డం కళావతి వెంకటస్వామి వారి సహకారంతో ప్రారంభించి ఇప్పటివరకు సుమారు 1100 మందికి కృత్రిమ అవయవాలు ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. అలాగే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానాలు, వైద్య శిబిరాలు, కంటి ఆపరేషన్లు తదితర సేవలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, కజంపురం రాజేందర్, తిలక్ చక్రవర్తి, మనోజ్ కుమార్ అగర్వాల్, గుండ వీరేశం, పోకల ఆంజనేయులు, కోలేటి శ్రీనివాస్, రమణయ్య, భేణిగోపాల్ త్రివేది లక్కం బిక్షపతి తో పాటు మహిళ లయన్స్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page