డిండి (గుండ్లపల్లి) జనవరి 21 త్రినేత్రం న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ నిర్వహణ పోటీలలో భాగంగా, డిండి మండల కేంద్రంలో ఎంపీడీవో వెంకన్న ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం గురించి ఎంపీడీవో మాట్లాడుతూ, మండల స్థాయిలో నిర్వహించే సీఎం కప్ లో కబడ్డీ ,కోకో ,వాలీబాల్, ఫుట్బాల్, యోగ ,అథ్లెటిక్స్ క్రీడలలో పాల్గొనే క్రీడాకారులు జనవరి 22వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన అన్నారు.
ఈ నెల 29న డిండి మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పోటీలు నిర్వహించబడతాయని ఎంఈఓ గోప్య నాయక్ తెలిపారు .ఈ కార్యక్రమంలో మండలంలోని ఎనిమిదో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు యాదయ్య, శ్రీనివాస్ ,శ్రీను, నవనీత ,స్నేహలత పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


