Meeseva : రాష్ట్రంలో రెండు రోజులపాటు ‘మీసేవ’లు బంద్

TRINETHRAM NEWS
'Meeseva' will be closed

Meeseva : త్రినేత్రం న్యూస్ : Apr 04, 2026, తెలంగాణ వ్యాప్తంగా మీసేవ కేంద్రాలు రెండు రోజులు బంద్ కానున్నాయి. ఇవాళ, రేపు (ఏప్రిల్ 4, 5) మూతపడనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి తెచ్చిన కొత్త సేవా రుసుములను సిస్టమ్‌లో అప్‌డేట్ చేయడం, సాఫ్ట్‌వేర్ ఆధునీకరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది.

సుమారు 36 గంటల పాటు సర్వర్లు అందుబాటులో ఉండవు కాబట్టి, ఆన్‌లైన్ పోర్టల్‌తో పాటు భౌతిక కేంద్రాల్లో కూడా ఎటువంటి లావాదేవీలు జరగవు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top