
Telangana Police Champion Trophy : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్, ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీసు బృందాలు వరుసగా మూడోసారి ఓవరాల్ చాంపియన్ ట్రోఫీని గెలుచుకుని హ్యాట్రిక్ సాధించాయి.
2024లో ఉత్తరప్రదేశ్లోని లఖ్ నవూ, 2025లో ఝార్ఖండ్లోని రాంచీలో జరిగిన పోటీల్లో తెలంగాణ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. 2026కు సంబంధించి మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన 69వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ లో కూడా తెలంగాణ ఓవరాల్ చాంపియన్ గా నిలిచింది. ఓవరాల్ చాంపియన్ ట్రోఫీతో పాటు యాంటీ-సాబోటేజ్ చెక్, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్నెస్ విభాగాల్లో విజేతగా నిలిచింది.
శాస్త్రీయ దర్యాప్తు సహాయాలు, పోలీస్ ఫోటోగ్రఫీ విభాగాల్లో రన్నరప్ సాధించింది. వరుస విజయాలతో తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో మరోసారి తమ ప్రతిభచాటడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి, సీఐడీ అడిషనల్ డీజీ చారు సిన్హాను ప్రశంసించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

