జూలై 26, 2026
TRINETHRAM NEWS
Massive Protest

విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, మేధావుల ఐక్య గళం.

Massive Protest : కూకట్పల్లి జూలై 02, (త్రినేత్రం న్యూస్) : నాంపల్లి ప్రాంగణంలోని తెలుగు విశ్వవిద్యాలయాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ గురువారం రోజు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులు, సాహితీ–సాంస్కృతిక వర్గాలకు చెందిన ప్రముఖులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్తలు తదితరులు పాల్గొని ప్రభుత్వం ఇప్పటికే ఆద్యకళకు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించిన మళ్లీ తిరుమలరావు,కోదండరాం ఎ ముఖం పెట్టుకోని తెలుగు విశ్వవిద్యాలయంలో కాలు మోపారని ప్రశ్నించారు. తెలుగు విశ్వవిద్యాలయ స్థలాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం సమంజసం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ విశ్వవిద్యాలయాన్ని బలహీనపరిచే చర్యలను వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణంలోనే కొనసాగాలని, ఇప్పటికే ఆద్యకళ ఆధీనంలో ఉన్న పాత వస్తువులు, సామగ్రిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తగిన మ్యూజియంకు తరలించాలని సూచించారు. ఆద్యకళ వారసత్వంపై నిజమైన అభిమానం ఉంటే, ఆ వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉండే ప్రత్యేక మ్యూజియంలో భద్రపరచడం ఉత్తమ మార్గమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో జ్యోతిష్యం, యోగా, బి.డిజైన్, పద్యనాటకం, దూరవిద్యతో పాటు పలు కోర్సుల్లో 2,500 మందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని, ప్రస్తుతం ఉన్న తరగతి గదులే సరిపోని పరిస్థితి ఉందని వక్తలు పేర్కొన్నారు.

ఇలాంటి సమయంలో మరిన్ని గదులను ఇతర అవసరాలకు కేటాయించడం వల్ల విద్యార్థుల విద్యా కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆద్యకళ ఆధీనంలో ఉన్న గదులను తిరిగి విశ్వవిద్యాలయానికి అప్పగించి, విద్యార్థుల అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్నవారు “తెలుగు విశ్వవిద్యాలయాన్ని కాపాడాలి” “నాంపల్లి ప్రాంగణాన్ని యథాతథంగా కొనసాగించాలి” “విద్యార్థుల హక్కులను పరిరక్షించాలి” అంటూ నినాదాలు చేశారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలను పునఃసమీక్షించి, విద్యార్థుల భవిష్యత్తు, తెలుగు భాషా–సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page