Teachers : గురువులారా! మీ బాధ్యతకు వందనం!

TRINETHRAM NEWS

కడియం:త్రినేత్రం న్యూస్ : గురువులంటే తరగతి గదిలో ఏవో నాలుగు పాఠాలు వల్లివేసేవారు మాత్రమే కాదు. బాధ్యతతో సమాజాన్ని తీర్చిదిద్దే స్ఫూర్తి ప్రదాతలు. అక్షరాలా ఈ నానుడిని నిజం చేస్తున్నారు మా కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన హెడ్ మాస్టర్ సత్యనారాయణ, తెలుగు మాస్టారు గొల్లపల్లి సత్యనారాయణ. నిన్న ఒక కార్యక్రమం నిమిత్తం నేను నా మిత్రుడితో కలిసి బైక్ మీద కడియం హైస్కూల్ వెనుక నుంచి సావరం రోడ్డు వైపుకి వెళుతున్నాను. సమయం మధ్యాహ్నం సుమారు 1:30 కావొస్తుంది. ఎండ తీవ్రత చాలా సుర్రు మంటోంది.

ఆ సమయంలో ఇద్దరు మాస్టర్లూ ఆ ఎండలో గోడకి రక్షణ ప్రాకారంగా ఇనప తీగలు చుడుతూ కనిపించారు. వారికి తెలియకుండానే నేను బండిమీంచి ఫోటో తీశాను. సెలవు రోజుల్లో, మిట్ట మధ్యాహ్నం, పాఠశాల గురించి, విద్యార్థుల చదువు గురించి వారు చేస్తున్న కృషికి, వారి అంకితభావానికి అందరూ గురువందనాలు చెప్పాల్సిందే! మా బాధ్యతా సేవా సంస్థ నుంచి వారు చేస్తున్న కృషికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా, గిరజాల బాబు వ్యవస్థాపక అధ్యక్షులు బాధ్యత సేవా సంస్థ, కడియం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Teachers! Salute to your

You cannot copy content of this page

Scroll to Top