కూకట్పల్లి జనవరి 24 (త్రినేత్రం న్యూస్) : బాచుపల్లి పరిధిలోని సాయినగర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగంలో జర్నలిస్ట్ గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలానికి చెందిన జర్నలిజం విద్యార్థి వెంకటేశ్వర్లు వైధ్యను జర్నలిజం శాఖ హెచ్వోడి డాక్టర్ సిహెచ్ పద్మప్రియ శాలువాతో సత్కరించి సన్మానించారు.
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజం నిరంతరం పేదల పక్షాన, బడుగు బలహీనుల పక్షాన సమస్యల స్వరాన్ని వినిపిస్తూ, నిత్యం ప్రశ్నించే గొంతుగా దిశా నిర్దేశం చేస్తూ,ప్రజలలో చైతన్యం ఆత్మ నిబ్బరం, కలిగించి స్ఫూర్తిని రగిలించేదిగా ఉండాలని. విలువలతో కూడిన జర్నలిజం నేటి సమాజానికి చాలా అవసరం ఉన్నదని.
జర్నలిజం చదువుతున్న విద్యార్థులు ప్రజాసారథులుగా సమాజంలో మార్పు కోసం ప్రతిక్షణం పాటుపడేవారిగా ఉండాలని ఆశాభవాన్ని వ్యక్తపరిచారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ జర్నలిజం శాఖలో ఐకమత్యంతో తోటి విద్యార్థుల పట్ల సంఘటితంగా కార్యక్రమాలు నిర్వహించటం తనకు సంతోషం కలిగించిందని,ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని,రాబోవు తరానికి మార్గదర్శకులుగా నిలవాలని ఆమె తెలిపారు.
సన్మాన గ్రహీత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన 25 ఏళ్ల జర్నలిస్టుగా ఎన్నో కథనాలు ప్రచురించి నాణ్యతతో కూడిన వార్తలనందిస్తూ పాఠకుల మన్ననలు పొందానని,జర్నలిజం విద్యార్థులు సత్కరించి, గౌరవించినందుకు చాలా సంతోషంగా ఉందని,ఈ సత్కారం నాకు జీవితంలో మరపురానిదని తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


