
Trinethram News : ఆఫ్ఘనిస్తాన్ లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 5.9 గా గుర్తించారు. ఆఫ్గాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 4 గంటల 43 నిమిషాలకు భూకంపం సంభవించింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూపూర్ ప్రాంతంలో భూ ప్రకంపనలో వచ్చాయి. 75 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది.
అఫ్గాన్‌లో భూకంపం సంభవించిన అనంతరం భారత్‌లోని పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. జమ్మూకాశ్మీర్ లోని కిష్ట్వార్ లో ఉదయం 5 గంటల 14 నిమిషాలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.4గా గుర్తించారు. 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపారు.
బంగ్లాదేశ్ లోనూ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల 7 నిమిషాలకు పలు చోట్ల భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రతను 2.9గా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
