CITU : రద్దు చెయ్యాలి లేబర్ కోడ్ లు

TRINETHRAM NEWS

తేదీ : 28/04/2025. పోలవరం నియోజకవర్గం : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలం, పాత దాచారం గ్రామంలో సి ఐ టి యు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డి. యన్. వి . డి ప్రసాద్ జెండా ఆవిష్కరణ చేసి , శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగింది. మే ఇరవై వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడం గొప్ప విశేషం. విశిష్టత నిర్మాణం , దేశవ్యాప్త సమ్మెపై ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మికుల చట్టాలను, నాలుగు లేబర్ కోడ్ లు మార్చి ఆ వర్గానికి తీవ్రమైన అన్యాయం చేసే విధంగా చూస్తుందని అన్నారు. నాలుగేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాలి, అని అయితే చట్టం ఉంటేనే ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా కార్మికులకు ద్రోహం చేస్తుంది అని తెలిపారు. అటువంటి చట్టాన్ని ఇప్పుడు మార్చి వాళ్లకు ఉరి తాళ్ళు గా చేస్తున్నారు అని విమర్శించారు.

సమస్యలు పరిష్కారానికై కార్మిక రాజ్యం కావాలని, సమ సమాజ నిర్మాణానికి సమాన వేతనం పనికి ఇస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక చట్టాలకు నిరసనగా సమ్మె లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ తరగతులకు సిఐటియు మండల కార్యదర్శి వై. సాయి కిరణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వై. నాగేంద్రరావు, సిఐటియు ఉపాధ్యక్షులు షేక్. వలి పాషా, సహాయ కార్యదర్శి తిరోజుల. సురేష్, మేడవరపు. రమాదేవి మరియు కార్మికులు బి. శ్రావణి, అన్నపూర్ణ, అలివేలు, మంగ, దుర్గమ్మ, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Labor Codes should be

You cannot copy content of this page

Scroll to Top