Jhelum River : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో జీలం నది నీటిమట్టం ఆకస్మికంగా పెరుగుదల

TRINETHRAM NEWS

Trinethram News : ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని పాక్ వర్గాల ఆరోపణ.. హట్టియాన్ బాలా ప్రాంతంలో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటన, నదీ తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచనలు.

స్థానికుల్లో భయాందోళన పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ పరిధిలో ప్రవహించే జీలం నది నీటిమట్టం శనివారం మధ్యాహ్నం అనూహ్యంగా పెరగడం తీవ్ర కలకలం రేపింది.

తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత వైపు నుంచి నీటిని విడుదల చేశారని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని స్థానికులు, పాకిస్థాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, సింధు జలాల ఒప్పందాన్ని (IWT) పక్కనపెట్టేందుకు భారత్ అనుసరిస్తున్న వ్యూహంలో ఇది భాగమేనని పాకిస్థాన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామంతో ముజఫరాబాద్ వ్యాప్తంగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jhelum river water level

You cannot copy content of this page

Scroll to Top