MLA Satyananda Rao : అమరావతి పనుల పునరుద్ధరణ సభను విజయవంతం చేయండి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : ఈనెల రెండవ తేదీన రాజధానిలో జరగనున్న అమరావతి పనుల పునరుద్ధరణ ప్రారంభ మరియు ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం నిమిత్తం దెందులూరు నియోజకవర్గ అబ్జర్వర్ గా నియమితులైన ఎమ్మెల్యే సత్యానందరావు స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు తో కలసి ఆయన కార్యాలయంలో కూటమి నాయకులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఆంధ్రుల రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు.ఇందుకోసం తెలుగుదేశం,జనసేన,భాజపా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే సత్యానందరావు సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Make the Amaravati renovation

You cannot copy content of this page

Scroll to Top