Man Dies : చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

TRINETHRAM NEWS
Man dies while fishing

Man Dies : కర్నూలు జిల్లా : మార్చి 25 : (త్రినేత్రం న్యూస్ ); వెల్దుర్తి మండలం , అందుగులపల్లిలో ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం ఆ గ్రామానికి చెందిన గోపాల్ (నలభై) పెద్ద చెరువులో ఈనెల ఇరవై నాలుగు వ తేదీన అనగా మంగళవారం నాడు ఆ వేటకు వెళ్లాడని , ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడని తెలిపారు.

విషయం తెలుసుకున్న అధికారులు గజ ఈత గాళ్ళ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top