
10 ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు
Mega Job Mela : అరకులోయ,నవంబర్ 26, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఏపీఎస్ఎస్డీసీ, జిల్లా ఉపాధి కల్పన విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 28న అరకులోయలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి. ప్రశాంత్ కుమార్ తెలిపారు.
అరకులోయ ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి జరిగే ఈ జాబ్ మేళాలో సుమారు 10 ప్రముఖ మల్టీనేషనల్, కార్పొరేట్ కంపెనీలు పాల్గొని నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.
10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అభ్యర్థులు రెజ్యూమ్, ఆధార్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజు ఫోటోలతో హాజరుకావాలని సూచించారు. జిల్లాలోని గిరిజన, మారుమూల ప్రాంతాల యువత తమ అర్హతలకు తగిన ఉద్యోగాలు పొందేందుకు ఈ జాబ్ మేళా మంచి అవకాశమని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe