తేదీ: 20/12/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈనెల అనగా డిసెంబర్ ఇరవై రెండు వ తారీఖున జరగనున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పర్యటనను విజయవంతం చేయాలని , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం బిజెపి అధ్యక్షులు కె.వి. ఎన్ దొర , ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్ పేయ్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఈ పర్యటన జరుగుతుందని తెలిపారు.
ఏలూరు ఆశ్రమం వైద్యశాల సమీపం నేషనల్హైవే ని ఆనుకుని హైవేని ఆనుకుని ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తోపాటు తమిళనాడు రాష్ట్రం మాజీ అధ్యక్షులు అన్నమలై ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పడం జరిగింది. విగ్రహవిష్కరణ అనంతరం ఆటోనగర్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణంలో బహిరంగ సభ ఉంటుందని సూచించారు . జనసేన, టిడిపి కూటమి ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


