Bharatiya Janata Party : భారతీయ జనతా పార్టీ డిండి మండల అధ్యక్ష, జిల్లా కౌన్సిల్ సభ్యుల ఎన్నిక

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) మే 2 త్రినేత్రం న్యూస్. భారతీయ జనతా పార్టీ డిండి మండల నూతన అధ్యక్షుని మరియు జిల్లా కౌన్సిల్ సభ్యుని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. డిండిమండల అధ్యక్షునిగా సింకారు సైదా. జిల్లా కౌన్సిల్ సభ్యునిగా వావిళ్ళ అంజి యాదవ్ ను ప్రకటించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య కార్యకర్తకు పార్టీ కోసం పని చేసే వ్యక్తులకు భారతీయ జనతా పార్టీలో పెద్దపీటవేస్తారనేదానికి ఈ ప్రకటననే నిదర్శనమని సుమారు 20 సంవత్సరాలుగా పార్టీలో ఎన్నో బాధ్యతలు నిర్వహించి పార్టీయే పరమావధిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన మాకు పార్టీ గుర్తించి ఈ పదవులు ఇవ్వడం మాపై ఇంకా బాధ్యత పెరిగిందని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చడంలో పూర్తిగా భాగస్వామ్యం అవుతూ అందరిని కలుపుకుపోయి డిండి మండలంలో భారతీయ జనతా పార్టీని బలమైన రాజకీయ శక్తిగా తయారు చేస్తామని పేర్కొన్నారు.

ఈ ఎన్నికకు సహకరించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జి మనోహర్ రెడ్డి కి జిల్లా సంస్థాగత ఇంచార్జ్ శ్రీ కట్టా సుధాకర్ రెడ్డి కి జిల్లా అధ్యక్షులు డాక్టర్ వర్షిత్ రెడ్డి కి నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఏ.టీ కృష్ణ , నక్క వెంకటేష్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి ,చిన్నమోను రాములుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Election of Bharatiya Janata Party

You cannot copy content of this page

Scroll to Top