Semi-Christmas Celebrations : ఘనంగా సెమీ క్రిస్టమస్ వేడుకలు

TRINETHRAM NEWS

తేదీ : 20/12/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం గాయత్రి పారా మెడికల్ కళాశాలలో సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ప్రభు కిరణ్ , అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ సి.హెచ్ వినీల. పాల్గొన్నారు. వాళ్లు మాట్లాడుతూ ఏసుక్రీస్తు త్యాగం, కరుణ ,ప్రేమ గొప్పతనాన్ని తమ బోధనల ద్వారా విశ్వ మానవాళికి తెలియజేశారని అనడం జరిగింది. ఆయన మార్గమే ఆదర్శమని అనేవారు .గాయత్రి పారామెడికల్ కళాశాల కరస్పెండెంట్ బి.వి శ్రీనివాసరావు మాట్లాడుతూ శత్రువుల సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి ఏసుక్రీస్తు అని అన్నారు ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించినటువంటి సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Semi-Christmas celebrations were held in grand style

You cannot copy content of this page

Scroll to Top