ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Major Fire

Major Fire : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెం. 11లోని బీఆర్కే న్యూస్ భవనంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్‌లో ఉన్న దారువాలా వైన్ మార్ట్ స్టాక్ స్టోరేజీలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 11 మందిని సురక్షితంగా కాపాడారు. నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ మొత్తంలో మద్యం అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page