
Major Fire Accident : తిరుపతి జిల్లా : మార్చి 17 : (త్రినేత్రం న్యూస్); ఆటోనగర్ లో ఉన్నటువంటి స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక షాపు నుంచి మరో షాపునకు మంటలు వేగంగా వ్యాపించి భారీగా చె లరేగాయి. అందులో ఉన్న సామాగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్థానికులు, దుకాణాల నిర్వహకులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

