తేదీ : 20/09/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పరిధిలో ఉన్నటువంటి ఉండి నియోజకవర్గం, మండలం, ఎండగండి గ్రామానికి చెందిన బిఎం ఎస్ ఎల్ లైన్ మెన్ దేవులూరి. సత్యనారాయణ, చిన్న కాపవరంలో కరెంటు స్తంభం ఎక్కి నెట్ కేబుల్ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. ఈ ఘటనపై ఆకివీడు హెడ్ కానిస్టేబుల్ జె. నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. సత్యనారాయణ బిఎస్ఎన్ఎల్ నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఫైబర్ నెట్ లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాడు. మృతుడి కుమారుడు దేవులూరి. శేషగిరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


