రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి (గుర్తింపు సంఘం) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే, యూనియన్ అధ్యక్షులు కూనంనేని సాంబశివ రావు తో కలిసి శనివారం హైదరాబాద్ లో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కి సింగరేణి లోని కార్మికుల సమస్యల పైన వినతి పత్రం ఇవ్వడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, మడ్డి ఎల్లా గౌడ్ లు పేర్కొన్నారు. శనివారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ గత వారం రోజులుగా సింగరేణి వ్యాప్తంగా ఏఐటియుసి నాయకత్వం గనుల మీద చేసిన విస్తృత ప్రచారం 19 వ తేదిన సంస్థ లోని అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద జరిగిన ఆందోళనలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో, సంస్థ వ్యాప్తంగా కార్మికుల్లో నెలకొన్న అసంతృప్తి దావానలంలా బయటపడడం వల్ల సమ్మె జరిగే అవకాశం ఉందని దీనివల్ల సంస్థ కు నష్టం తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర మైన అప్రతిష్ట కలిగే అవకాశం ఉందని, ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇవ్వడం తో వెంటనే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మీ యూనియన్ నాయకులతో కలిసి రండి, సింగరేణి పై చర్చిద్దామని చెప్పగానే గుర్తింపు సంఘం ఏఐటియుసి అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు వెళ్లి ముఖ్యమంత్రి ని కలవడం జరిగిందని వారు పేర్కొన్నారు. సింగరేణి లో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలను ప్రకటించి
వాస్తవ లాభాల్లో 35 శాతం వాటా ఇవ్వాలని, అదేవిధంగా స్వంత ఇంటి పథకం అమలు చేయాలని, మెడికల్ బోర్డు ఏర్పాటుచేసి అనారోగ్యం తో బాధపడుతున్న అందరిని ఆన్ ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, కార్మికుల మారుపేర్ల సమస్య విషయంలో అడ్వకేట్ జనరల్ తో న్యాయ సలహా త్వరగా వచ్చేట్లు ఆదేశాలివ్వాలని,ఇన్కమ్ టాక్స్ విషయంలో అలవెన్సుల పై రికవరీ చేసిన వాటిని కార్మికులకు రిఫండ్ చేయాలనీ, నూతన బొగ్గుగనులు
వచ్చేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలిచ్చి,కోయగూడెం-3,సత్తు పల్లి -3,తాడిచర్ల -2 బ్లాకులను సింగరేణికే వచ్చేవిదంగా తగు నిర్ణయం తీసుకోవాలని తదితర సమస్యలను పరిష్కరించాలని మెమోరాండం ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇట్టి సమస్యలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ యాజమాన్యానికి మీ ఉత్తరాలను పంపించి దసరా తరువాత సంబంధిత మంత్రులు , యాజమాన్యం మరియు యూనియన్ నాయకులను కూర్చండపెట్టి తగు నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడం జరిగిందని వారు పేర్కొన్నారు. అదేవిధంగా లాభాల్లో వాటా విషయంలో శనివారం సాయంత్రం యాజమాన్యం మీరు చర్చించుకొని సంబంధిత మంత్రి కలిసి తగు నిర్ణయం తీసుకోమని ఆదేశాలు ఇస్తానని ముఖ్యమంత్రి తెలియచేయడం జరిగిందని వారన్నారు. స్పందించిన ముఖ్యమంత్రి కి ఏఐటియుసి యూనియన్ తరుపున కృతజ్ఞతలు తెలుపుచున్నామని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్, జూపాక రాంచందర్,జీగురు రవిందర్, మందల రాంచంద్రారెడ్డి, మాదన మహేష్, రంగు శ్రీను, గండి ప్రసాద్, సిర్ర మల్లికార్జున్, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, చెప్యాల భాస్కర్, నాయిని శంకర్, బలుసు రవి, దాసరి శ్రీనివాస్, గొడిశల నరేశ్, కే.శ్రీనివాస రావు,డి.టి.రావు, క్రాంతి, గంగాధర్, అజీం పాషా, పెద్దెల్లి శంకర్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


